ముంబై 26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ కు 10 ఏళ్ల జైలు శిక్ష

ముంబై 26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. రెండు ఉగ్రవాద కేసుల్లో దోషిగా నిర్థారించిన కోర్టు అతనికి ఈ శిక్ష విధించింది. పదేళ్ల జైలు శిక్షతో పాటు అతని ఆస్తులను కూడా సీజ్ చేయాలని అదే సమయంలో రూ. 1,10,000 జరిమానా విధించింది. ఇక హఫీజ్‌తో పాటు అతని సన్నిహితుడు అబ్దుల్ రెహ్మాన్ మక్కికి ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరిగింది.

ఇక తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు . మరోవైపు 2008 ముంబైలో జరిగిన ఉగ్రదాడి వెనక హఫీజ్ సయీద్‌దే మాస్టర్ మైండ్ అని విచారణ సంస్థలు తేల్చాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

Latest Updates