ఐదోసారి తండ్రైన షాహిద్..నెటిజన్ల సాయం కోరుతూ ట్వీట్

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఐదోసారి తండ్రయ్యాడు. అతని భార్య నదియా ఐదోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే అఫ్రిదీకి నలుగురు ఆడపిల్లలు ఉండగా..తమ ఫ్యామిలీలోకి ఐదో పాపను ఆహ్వానిస్తున్నట్లు ఆఫ్రిది సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.

నెటిజన్ల సాయం కోరుతూ ట్వీట్

ఇదిలా ఉంటే అఫ్రిది తన ఐదో కూతురికి A అక్షరం మీద పేరు పెట్టాలని అన్నాడు. అందుకు నెటిజన్ల సాయం కోరాడు. నలుగురి కుమార్తెల పేర్లలోని మొదటి అక్షరం A ఉండగా..ఐదో కుమార్తెకు A అక్షరంతో పేరు పెట్టాలని, అందుకు పేరు సెలక్ట్ చేసి పంపిన వారికి బహుమతి ఇస్తామని ట్వీట్ చేసాడు.

 

Latest Updates