రాష్ట్రపతి ప్రయాణానికి అనుమతి నిరాకరించిన పాకిస్తాన్

pakistan-denies-president-ram-nath-kovinds-request-to-use-its-airspace

పాకిస్తాన్ గగనతలంలో భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రయాణానికి అనుమతి నిరాకరించింది. సోమవారం నాడు రాష్ట్రపతి కోవింద్ యూరప్ దేశాల పర్యటనకు వెళ్తున్నారు. పాక్ ఏయిర్ స్పేస్ లో ప్రయాణించేందుకు పాక్ అనుమతి కోరింది భారత్. అయితే ద్వైపాక్షిక సంబంధాల్లో భారత వైఖరిపై తాము అసంతృప్తిగా ఉన్నామని… అందుకే భారత రాష్ట్రపతి ప్రయాణించే విమానానికి పర్మిషన్ ఇవ్వడంలేదని పాకిస్తాన్ తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ ప్రకటన చేశారు. సోమవారం నుంచి ఐస్ లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియాల్లో రాష్ట్రపతి పర్యటించాల్సి ఉంది.

Latest Updates