పాక్ నీచబుద్ధి: 1800 మంది ఉగ్రవాదులు మంచోళ్లంటూ సర్టిఫికెట్

కరోనా వైరస్ ఆట కట్టించేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా..?

దాయిది దేశం “ పాకిస్తాన్‌ నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ” సంస్థ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ జాబితాలో ఉన్న ఉగ్రవాద అనుమానితులతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు, ఆర్ధిక కార్యకలాపాలు జరగకుండా ఆర్ధిక సంస్థల్ని అడ్డుకుంటుంది.

తాజాగా పాక్ నాక్టా జాబితా నుంచి 1800మంది ఉగ్రవాదుల పేర్లను తొలగించింది. వారిలో 2008 ముంబైలో 3రోజుల పాటు పది మంది ఉగ్రవాదులు 8 ప్రాంతాల్లో మారణ హోమానికి పాల్పడ్డారు. ఈ మారణ హోమంలో 173మంది ప్రాణాలు కోల్పోయారు.308మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రమూకలు రక్తపాతం సృష్టించేందుకు కారణమైన ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే కమాండర్‌ జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీ సహా 1800 మంది ఉగ్రవాదుల పేర్లను పాకిస్తాన్ తన నిఘా జాబితా నుంచి తొలగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

పాక్ కు ఎందుకంత తొందర

కరోనా వైరస్ అడ్డుకోవాల్సిన సమయంలో పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల జాబితానుంచి 1800మందిని తొలగించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.  టెర్రరిస్టులు ఉగ్రవాద సంస్థలకు నిధుల అందజేతను అడ్డుకునేందుకు, మనీ లాండరింగ్ కు చెక్ చెప్పేందుకు పారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏ‌టీ‌ఎఫ్) సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.  ఈ సంస్థతో ఆయా దేశాలు ఆర్ధిక ఒప్పొందాలు కుదుర్చుకున్నాయి. ఆ జాబితాలో పాక్ కూడా ఉంది.

ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలతో లావాదేవీలు జరుపుతున్నట్లు తెలిస్తే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న దేశాలకు  ఆర్ధిక సాయాన్ని తిరస్కరిస్తుంది. కాబట్టే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఆర్ధిక సమస్యలు, మరోవైపు కరోనా , ఎఫ్ ఏటీఎఫ్ సంస్థ బ్లాక్ లిస్ట్ వీటన్నింటిని తప్పించుకునేందుకు ఉగ్రవాదుల జాబితానుంచి 1800మంది పేర్లను తొలగించిన అమెరికన్ మీడియా వెల్లడించింది.  2018లో ఉగ్ర జాబితాలో 7600 పేర్లుండగా, గత 18 నెలల్లో ఈ సంఖ్య 3800కు తగ్గిందని  మార్చి నుంచి 1800 పేర్లను ఈ జాబితా నుంచి తొలగించారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

Latest Updates