ఏప్రిల్ 16-20 మధ్య భారత్ మరో దాడి చేయబోతోంది : పాక్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ పై భారత్ మరోసారి దాడులకు సిద్దమయిందని ఆరోపించారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి. ఏప్రిల్ 16 నుంచి 20 లోపు పాక్ పై ఈ దాడి జరగవచ్చని తమకు విశ్వసనీయంగా తెలిసిందని ఆయన ఇస్లామాబాద్ లో చెప్పారు.

ఇస్లామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత్ లో ఉన్న అధికార పార్టీ.. యుద్ధం కావాలని కోరుకుంటోందని.. దీని  కోసం కొత్త ప్లాన్ వేస్తుందన్నారు. తమకు అందిన ఇంటలిజెన్స్ రిపోర్ట్  ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 20 లోపు  తమ భూభాగంలో భారత్ దాడి చేయొచ్చని చెప్పారు. ఈ విషయం తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుమతితోనే  చెబుతున్నానని అన్నారు మహమ్మద్ ఖురేషి.

Latest Updates