ఇండియాలోనే ఉంటా.. పాక్ లో రక్షణ లేదు: పాక్ మాజీ ఎమ్మెల్యే

పాకిస్తాన్ లో తమకు రక్షణ లేదని, తమకు భారత్ లో ఆశ్రయం కావాలంటూ ఆ దేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ లో మైనార్టీలకు రక్షణ లేదని, ఆ దేశంలో సిక్కులను, హిందువులను వేధిస్తున్నారని బల్దేవ్ తెలిపారు. పాక్ లో ముస్లింలకు కూడా రక్షణ కరువైందని, వారంతా కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు.  భారత ప్రధాని మోదీ ఈ విషయంలో సాయం చేయాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా వేడుకున్నారు.

బల్దేవ్ కుమార్.. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్  పార్టీలో ఎమ్మెల్యేగా పని చేశారు.  ఓ హత్య కేసులో ఇరుక్కున్న ఆయన్ను.. అక్కడి ప్రభుత్వం నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ లో ఉండడం క్షేమం కాదని భావించిన బల్దేవ్ కుటుంబంతో కలసి విజిటింగ్ వీసా మీద భారత్ కు వచ్చారు. ఆ గడువు త్వరలో ముగియనుండడంతో.. తనకు పాకిస్తాన్ కు వెళ్లాలంటే భయంగా ఉందని, భారత లో ఆశ్రయమిస్తే ఇక్కడే ఉండిపోతానంటూ ప్రధాని మోడిని అభ్యర్ధించారు.

 

Pakistan former MLA request to Modi for asylum in India

Latest Updates