పాక్ పై విజయం సాధిస్తాం : మోడీ

న్యూఢిల్లీ : ఐకమత్యంగా పోరాడి పాకిస్తాన్‌ పై విజయం సాధిస్తామని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. పాకిస్తాన్‌ చెబుతున్న అబద్ధాలను నమ్మొద్దని తెలిపారు మోడీ. ఈ విషయంపై విపక్షాలకు రిక్వెస్ట్ చేశారు. అభినందన్‌ లా ధైర్యంగా నిలబడాలని ప్రతిపక్షాలకు సూచించారు. పాక్‌ కుట్రలను బహిర్గతం చేయలని తెలిపారు. సరిహద్దులో భారత జవాన్ల సేవలను ప్రధాని కొనియాడారు.

భారత్ నైతిక స్థైర్యాన్నిదెబ్బతీయాలని పాక్‌ ప్రయత్నిస్తోందని మోడీ సీరియస్ అయ్యారు. భారత సైన్యానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. భారత శక్తిని ఎవరూ ఆపలేరని ప్రధాని మోడీ విశ్వాసం తెలిపారు.

 

Latest Updates