పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదరి కాంట్రవర్సియల్ కామెంట్స్

పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదరి  కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. భారత్ లోకి చొరబడి దాడి చేశామంటూ..  పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడారు. ఇది ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పాక్ ప్రజల విజయమన్నారు. దీనిపై  కొందరు సభ్యులు అభ్యంతరం చెప్పడంతో వెంటనే తన  మాట మార్చారు. పుల్వామా ఘటన తర్వాత.. పాక్ లోకి చొరబడి దాడిచేశామని చెప్పుకొచ్చారు. బాలాకోట్ దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. తమ ధైర్యానికి ప్రతీకగా.. తాము అమాయకులను చంపలేదన్నారు ఫవాద్ చౌదరి. ఉగ్రవాదాన్ని తాము కూడా వ్యతిరేకిస్తున్నామన్నారు.

Latest Updates