పాకిస్థాన్ ప్రపంచంలోనే డేంజరస్ కంట్రీ

అణ్వాయుధాలున్న ఉగ్రవాద దేశం ప్రపంచానికి ప్రమాదం

పాకిస్థాన్ ఫ్యూచర్ గురించి ఆలోచించే నాయకుడు అక్కడ లేడు

అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి జేమ్స్ మ్యాటిస్ కామెంట్స్

పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం అని అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి జేమ్స్ మ్యాటిస్ అన్నారు. పాకిస్థాన్ దూకుడు స్వభావం ఉన్న దేశం అని అన్నారు. అమెరికా మిలటరీతో దశాబ్దాల పాటు పనిచేసిన అనుభవం ఉన్న జేమ్స్ మ్యాటిస్.. అధ్యక్షుడు ట్రంప్ కేబినెట్ లోనూ పనిచేసి గత జనవరిలో బయటకొచ్చారు.

పాకిస్థాన్ ఉగ్రవాదంతో సహవాసం చేస్తూ.. ఆ దేశంలోని సమాజాన్ని కూడా తప్పుదోవలో నడిపిస్తోందన్నారు జేమ్స్ మ్యాటిస్. తాను డీల్ చేసిన చాలా దేశాలతో పోల్చితే.. అణు ఆయుధాలను సంపాదించుకుని, టెర్రరిజాన్ని పోషిస్తున్న పాకిస్థానే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశమని చెప్పారు.

భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ.. పాకిస్థాన్ భౌగోళిక రాజకీయాలు చేస్తోందని చెప్పారు జేమ్స్ మ్యాటిస్. భారత్ ప్రభావం లేని.. పాకిస్థాన్ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని ఆప్ఘనిస్థాన్ లో ఆ దేశం ఆశిస్తోందని చెప్పారు. ఉగ్రవాదుల అండదండలున్న దేశానికి ఆధుని అణ్వాయుధాలు దొరికితే.. అది ప్రపంచానికి వినాశనమే మిగులుస్తుందన్నారు. పాకిస్థాన్ లో ఆ దేశం భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడే లేడని అన్నారు. “పాకిస్థాన్ తో అమెరికాకు ఉన్న  సమస్యలను పరిష్కరించుకోగలం. కానీ వైరుధ్యాలు, అపనమ్మకం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి” అని మ్యాటిస్ చెప్పారు.

Latest Updates