టెర్రర్ గ్రూప్స్ లేవని పాకిస్తాన్ నిర్థారించుకోవాలి

ఇండో-యూఎస్ జాయింట్ స్టేట్ మెంట్
వాషింగ్టన్: పాకిస్తాన్ తమ దేశ భూభాగంలో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని యూఎస్-ఇండియా ఉమ్మడి ప్రకటనలో కోరాయి. అందుకు అవసరమైన చర్యలను త్వరితగతిన తీసుకోవాలని పేర్కొన్నాయి. పాక్ తమ భూభాగంలో ఎలాంటి టెర్రర్ గ్రూప్స్ లేవని నిర్థారించుకోవాలని ఇండో-యూఎస్ ప్రశ్నించాయి. బుధ-గురువారాల్లో జరిగిన 17వ ఇండియా-యూఎస్ కౌంటర్ టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ తర్వాత ఈ స్టేట్ మెంట్ వెలువడింది. సరిహద్దు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందేనని ఇరు దేశాలు తెలిపాయి.

ఇండియా తరఫున ఈ సమావేశానికి కౌంటర్ టెర్రరిజం జాయింట్ సెక్రటరీ మహవీర్ సంఘ్వీ అధ్యక్షత వహించారు. అమెరికాకు స్టేట్ డిపార్ట్ మెంట్ కోఆర్డినేటర్ కౌంటర్ టెర్రరిజం నాథన్ సేల్స్ నాయకత్వం వహించారు. ‘పాకిస్తాన్ తక్షణమే ఉగ్రవాద నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు (ఇండియా-యూఎస్) భావిస్తున్నాయి. పాక్ అధీనంలోని ఏ భూభాగంలోనూ ఉగ్రవాద కార్యకలాపాలు జరగొద్దని, టెర్రరిస్టు దాడులకు లక్షంగా ఉపయోగించొద్దని కోరుతున్నాం’ అని ఉమ్మడి ప్రకటనలో యూఎస్-ఇండియా వివరించాయి. టెర్రరిజంపై పోరులో మద్దతుగా నిలుస్తున్నందుకు భారత ప్రజలకు, ప్రభుత్వానికి యూఎస్ ధన్యవాదాలు చెప్పింది.

Latest Updates