పాక్ తో ఎలాంటి చర్చల్లేవు: విదేశాంగ మంత్రి జైశంకర్

జమ్మూకశ్మీర్ విషయంలో షరతులతో కూడిన చర్చలు జరపాలన్న పాక్ ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఆయన..  పాక్ తో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే  లేదని బదులిచ్చారు. పాక్ బహిరంగంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుందన్నారు. పాక్ లో ఇప్పటి వరకు చీకటి మాటున జరిగిన ఉగ్రవాదం పగటి పూట జరుగుతుందని విమర్శించారు. కశ్మీర్ లో త్వరలోనే సడలింపునిస్తామన్నారు. భద్రతా దళాల సంఖ్య కూడా తగ్గిస్తామన్నారు. పాక్ తాపత్రయమంతా ఉగ్రవాదం గురించేనన్నారు.

Latest Updates