ఇండియా నుంచి పాకిస్తాన్ కు అక్రమంగా మందులు

  • విచారణకు ఆదేశించిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : ఇండియా నుంచి పాకిస్తాన్ కు దాదాపు 450 రకాల విటమిన్ ట్యాబ్లెట్లు అక్రమంగా ఇంపోర్ట్ అవుతున్నాయంట. పాకిస్తాన్ లో ఈ వ్యవహారం రచ్చ రచ్చ కావటంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రియాక్ట్ అయ్యారు. దీనిపై విచారణకు ఆదేశించారు. వాస్తవానికి పాకిస్తాన్ తో మనదేశం గతేడాది ఆగస్టు నుంచే వాణిజ్యపరమైన సంబంధాలను రద్దు చేసుకుంది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో పాక్ తో వివాదం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా పాకిస్తాన్ లో ప్రాణధార మందులు కావాల్సినన్నీ ఉత్పత్తి అవటం లేదు. ముఖ్యమైన డ్రగ్స్ కు ఇబ్బంది ఏర్పడుతుందని ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయటంతో వాణిజ్య పరమైన ఆంక్షలకు కాస్త సడలింపు ఇచ్చారు. ప్రాణాధర డ్రగ్స్ తో పాటు ముడి సరకు ఇంపోర్ట్ కు పాక్ పర్మిషన్ ఇచ్చింది. ఐతే ఇదే అదునుగా దాదాపు 450 రకాల విటమిన్ ట్యాబ్లెట్లు అక్రమంగా పాకిస్తాన్ దిగుమతి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆంక్షల సడలింపును ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ అక్రమంగా మందుల సప్లయ్ పెద్ద కుంభకోణం అంటూ పాకిస్తాన్ లో వివాదం మొదలైంది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.

Latest Updates