పాక్ క్రికెట్ జట్టుపై ఫోకస్ పెడతా: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ క్రికెట్ జట్టును వచ్చే వరల్డ్ కప్ నాటికి మేటి జట్టుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అమెరికాలో పర్యటిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఇటీవల జరిగిన వరల్డ్ కప్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే  వరల్డ్ కప్ వరకు పాక్ క్రికెట్ జట్టును ప్రొఫెషనల్ క్రికెట్ జట్టుగా మారుస్తానన్నారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్ల కోసం క్షేత్రస్థాయిలో ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టును అత్యుత్తమ జట్టుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు.ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఐదోస్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

 

Latest Updates