టెర్రరిస్ట్ బిన్ లాడెన్ అమరవీరుడంట!

ఇస్లామాబాద్:మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఆల్ ఖైదా ట్రెరరిస్ట్ సంస్థ స్థాపకుడు బిన్ లాడెన్ పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ప్రపంచాన్ని పరేషాన్ చేసిన ఈ టెర్రరిస్ట్ ను అమరవీరుడిగా కీర్తించారు. పాక్ పార్లమెంట్ వేదికగా గురువారం ఈ కామెంట్స్ చేశారు. ” అమెరికా వాళ్లు అబోటాబాద్ లో బిన్ లాడెన్‌‌ను చంపినప్పుడు మనమంతా బాధపడ్డాం. అతను అమరవీరుడు ” అని అన్నారు. ఇమ్రాన్ ప్రసంగం అన్ని చానెల్స్ లో లైవ్ టెలికాస్ట్ అయ్యింది. దేశం కోసం పోరాడుతూ శత్రువుల చేతిలో చనిపోయిన సైనికులను అమరులుగా కీర్తిస్తారు. అలాంటిది ప్రపంచమంతా ఎన్నో టెర్రర్ అటాక్ లు చేసిన వ్యక్తిని అమరుడిగా కీర్తించటం కాంట్రవర్షియల్​గా మారింది. ప్రధాని కాకముందు ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ లాడెన్ ను టెర్రరిస్ట్ అనడానికి ఇమ్రాన్ ఖాన్ ఇష్టపడలేదు. పైగా బ్రిటీషర్లకు యూఎస్ ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ టెర్రరిస్ట్ కాని, మిగతా వారికి ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్‌ అంటూ సరిపోల్చారు. ఇమ్రాన్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2001 లో అమెరికాలోని ట్విన్ టవర్స్ ను కూల్చేయటంలో బిన్ లాడెన్ ప్రధాన సూత్రధారి కావటంతో 2011 లో పాక్ లోని అబోటాబాద్ లో అమెరికన్ నేవీ సీల్ టీమ్ బిన్ లాడెన్ ను హతమార్చింది.

ప్రతి ముగ్గురిలో ఒకరు ఫేక్ పైలటే

పాకిస్తాన్ లో పైలట్ల కు సంబంధించి సంచలన విషయాన్ని ఆ దేశ ఏవియేషన్ మినిస్టర్ గులాం సర్వార్ ఖాన్ బయటపెట్టారు. దేశంలో ఉన్న పైలట్లలో 30 ఫేక్ పైలట్లేనంట. ఈమధ్యనే పాకిస్తాన్ విమానం ఒకటి ల్యాండ్ అయినప్పుడు కుప్పకూలటంలో పైలట్ల నిర్లక్ష్యమే ఉందని తేల్చారు. ఈ ఘటన నేపథ్యంలో పాక్ పార్లమెంట్ లో ఫేక్ పైలట్ల అంశాన్ని మంత్రి వివరించారు. దేశంలో 860 మంది పైలట్లు ఉంటే అందులో 262 మందికి ఫేకేనంట. వారికి ప్లైట్ నడపటంలో ఎలాంటి అనుభవం లేదని తేల్చారు. వారి తరఫున వేరే వారికి డబ్బులు ఇచ్చి ఎగ్జామ్స్ రాయించారని స్వయంగా ఏవియేషన్ మినిస్టరే తెలిపారు. నకిలీ లైసెన్స్ తో వీరంతా ఫ్లైట్లు నడుపుతున్నారని చెప్పారు.

 రాజీవ్ ట్రస్ట్ కు చైనా విరాళాలు

 

Latest Updates