కరోనా అనుమానం: క్వారంటైన్ కు పాక్ ప్రధాని

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  క్వారంటైన్ కి వెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ స్వచ్ఛందసేవా సంస్థ ఈదీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఫైసల్ ఈదీ ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ను కలసి కరోనా సహాయక చర్యల కోసం పది కోట్ల రూపాయల చెక్కు ఇచ్చారు. ఇమ్రాన్ స్వయంగా దాన్ని అందుకున్నారు.

ఆ తరువాత ఈదీకి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆయనను ఐసోలేషన్ వార్డ్ లో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఈదీతో పాటు ఆయన కుటుంబసభ్యులకు కరోనా వైరస్ సోకడంతో..పాక్ ప్రధాని పర్సనల్ డాక్టర్  కత్ ఖానుమ్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ సిఇఒ డాక్టర్ ఫైసల్ సుల్తాన్ అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ టెస్ట్ లు చేయించుకోవాలని ప్రధానికి సలహా ఇచ్చారు. సుల్తాన్ సలహాతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా వైరస్ టెస్ట్ లు చేయించుకున్నారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉండగా.. దేశంలో కరోనా వైరస్ బాధితులు పెరిగిపోవడం, ఏకంగా దేశ ప్రధానికి కరోనా సోకితే తమ పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

 

Latest Updates