ఒక్కరోజులో 40 మరణాలు.. 1,049 కేసులు

ఇస్లామాబాద్: గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా పాకిస్తాన్ లో రికార్డు స్థాయిలో 40 మంది చనిపోయారు. 1,049 కొత్త కేసులు నమోదయ్యాయని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్‌లో 8,420, సింధ్ 8,189, ఖైబర్-పఖ్తున్ఖ్వా 3,499, బలూచిస్తాన్ 1,495, ఇస్లామాబాద్ 485, గిల్గిత్ -బాల్టిస్తాన్ 386, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ 76 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా మృతుల సంఖ్య 526 కు చేరుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను క్రమంగా ఎత్తివేస్తామని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. మే 10 నుంచి రైల్వేలు పాక్షికంగా కార్యకలాపాలు ప్రారంభించవచ్చని, ప్రారంభంలో 40 రైళ్లను నడపవచ్చని అక్కడి రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. ఇప్పటివరకు పాకిస్తాన్ లో వైరస్  కేసులు 22,413 కు చేరుకున్నాయి. 6,217 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

 

Latest Updates