పుల్వామా ఉగ్రదాడే కాదు: పాక్

జైషే ఈ మొహమ్మద్ (జేఈఎమ్) చీఫ్ మసూద్ అజర్ కుపుల్వామా దాడితో సంబంధం లేదని పాకిస్థాన్ ప్రకటించింది. దాడిపై ఇండియా ఇచ్చిన 91 పేజీల రిపోర్టులో 6 పార్టులు ఉన్నాయంది. వాటిలో రెండు, మూడు పార్టులే పుల్వామాకు సంబంధించినవని,మిగతావి ఇండియా ఎప్పటి నుంచో తమపైచేస్తున్న ఆరోపణలని చెప్పింది. పది మందిసభ్యులతో కూడిన కమిటీ ఇండియా రిపోర్టును పరిశీలించిందని తెలిపింది. అజరే ఉగ్రదాడి చేయించారనడానికి సరైన ఆధారాలేవీ రిపోర్టులో చూపలేదని వివరించింది. పాక్ సమాధానాలను విదేశాంగ శాఖతీవ్రంగా ఖండించింది. మసూద్ బ్లాక్ లిస్ట్ కు అమెరికా తీర్మానంమసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా గుర్తించేందుకు ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ ముందు అమెరికా తీర్మానంప్రవేశపెట్టింది. దీంతో చైనా కస్సుమంది.అమెరికా చర్య ‘మసూద్’ సమస్య మరింత జఠిలం చేస్తుందని అభిప్రాయపడింది.

Latest Updates