బుకీలతో బేరం..పాక్ క్రికెటర్ పై వేటు

బుకీతో బేరాలాడిన పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సస్పెండ్ అయ్యాడు. ఇప్పటికే పాక్ చెందిన పలువురు క్రికెటర్లు డబ్బు సంపాదించేందుకు  ఫిక్సింగ్ కు పాల్పిడన విషయం తెలిసిందే. తాజాగా ఉమర్ అక్మల్ బుకీతో బేరాలాడినట్లు పక్కా ఆధారాలు వెలుగులోకి రావడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీపీ) వేటు వేసినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఉమర్ అక్మల్ ను పీసీబీ అవినీతి నిరోధక విభాగం అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. తొలత ఉమర్ బుకీలతో సంబంధం లేదని బుకాయించినా అవినీతి నిరోధక శాఖ పక్కా ఆధారాల్ని వెలికి తీయడంతో చేసిన తప్పు ఒప్పుకున్నాడు.

నిజానికి పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)లో ఆడేందుకు సిద్ధంగా ఉన్న ఉమ‌ర్ .. బుకీని క‌లిసినట్లు అనుమానం రావడంతో పాటు పీసీబీ ఉమర్ తో పాటు పలువురు క్రికెటర్లపై నిఘూ ఉంచింది. ఫోన్లు ట్యాప్ చేయడం, అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నట్లు క్రికెటర్లు విచారించింది.  తాజాగా ఉమ‌ర్‌ పై అనుమానం రావడంతో మూడు నాలుగురోజులు విచారణ చేపట్టి  అత‌నిపై సస్పెన్ష‌న్ వేటు వేశార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

 కాగా గ‌తేడాది లంక‌తో చివ‌రిసారిగా అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడిన ఉమ‌ర్‌.. తాజా పీఎస్ఎల్ ఎడిష‌న్‌లో స‌త్తాచాటి జాతీయ‌జ‌ట్టులోకి రావాల‌ని ఆశించాడు. అయితే బుకీని క‌లిసి చెడు దారులు తొక్క‌డంతో అత‌నిపై వేటు ప‌డినట్లు తెలుస్తోంది.

Latest Updates