పాక్ కొత్త నాటకం: భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందట

పచ్చకామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనపడుతుందట.. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. తాను చేసిన ఉగ్ర చర్యలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగించేందుకు సిద్దపడింది పాక్.  కులభూషన్ జాదవ్ కేసు పై అంతర్జాతీయ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. భారత్ తమ దేశంలో  ఉగ్ర చర్యలకు పాల్పడుతుందని పాకిస్తాన్ తెలిపింది. పాక్ లోని పెషావర్ లో జరిగిన ఉగ్ర దాడిని భారత్ చేయించిందని ICJ లో వాదించింది. ఈ ఘటనలో తాము 140 మంది విద్యార్థులను కోల్పోయామని అందుకు భారత్ కారణమని చెప్పింది. పాక్ తరపున ఆదేశ అటర్ని జనరల్ మన్సూర్ ఖాన్ వాదనలు వినిపించారు.

పాకిస్తాన్ లో ఉగ్ర చర్యలను ప్రోత్సహించేందుకు  కులభూషన్ జాదవ్ ను భారత్  ఉపయోగించుకుందని అన్నారు పాక్ అటర్ని జనరల్ మన్సూర్ ఖాన్. జాదవ్ ఒక రా ఏజెంట్ అని అన్నారు. పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ను జాదవ్ టార్గెట్ చేశాడని తెలిపారు.

Latest Updates