పాకిస్థాన్ ‘క‌రోనా కుట్ర’‌: జ‌మ్ము క‌శ్మీర్ డీజీపీ

పాకిస్థాన్ ఉగ్ర బుద్ధి మార్చుకోలేద‌ని మ‌రోసారి రుజువైంది. ప్ర‌పంచ‌మంతా క‌రోనాపై పోరాడుతున్న స‌మ‌యంలోనూ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. ప‌దే ప‌దే భార‌త ఆర్మీపై కాల్పుల‌కు దిగుతోంది. పాక్ నుంచి ముష్క‌రుల చొర‌బాట్ల‌కు వీలుగా.. భార‌త సైన్యం దృష్టిని మ‌ర‌ల్చేందుకు య‌త్నిస్తోంది. ఉగ్ర‌వాదుల‌ను స‌రిహ‌ద్దులు దాటించి జమ్ము క‌శ్మీర్ లో నిత్యం మార‌ణ హోమానికి కుట్ర‌లు చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉగ్ర‌మూక‌ల్ని భార‌త్ లో పంపుతున్న దాయాది దేశం.. ఇప్పుడు కొత్త ప‌న్నాగాల‌కు పాల్ప‌డుతోంది. క‌రోనా మ‌హమ్మారి బారిన‌ప‌డిన‌ వారిని స‌రిహ‌ద్దు దాటించి జ‌మ్ము క‌శ్మీర్ లో ప్ర‌జ‌ల‌కు వైర‌స్ అంటించేందుకు జిత్తులమారి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. నేపాల్ స‌రిహ‌ద్దుల గుండా క‌రోనా సోకిన ఉగ్ర‌వాదుల‌ను బీహార్ లోకి పంపే ప్ర‌య‌త్నం చేయ‌డంతో కొద్ది రోజుల క్రితం స‌హ‌స్త్ర సీమా బ‌ల్ జ‌వాన్లు అరెస్టు చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఇప్పుడు క‌శ్మీర్ లోకి కూడా క‌రోనా బారిన‌ప‌డిన వారిని పంపి వైర‌స్ వ్యాప్తికి పాక్ కుట్ర‌లు చేస్తోంద‌ని స్వ‌యంగా జ‌మ్ము క‌శ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ అన్నారు. బుధ‌వారం ఉద‌యం ఆయ‌న ఉత్త‌ర క‌శ్మీర్ లో ఉన్న‌ గందేర్బ‌ల్ జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్లో ఏర్పాటు చేసిన‌ క్వారంటైన్ సెంట‌ర్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టి దాకా ఉగ్ర‌వాదుల‌ను భార‌త్ లోకి పంపి దాడులకు పాల్ప‌డిన‌ పాక్.. ఇప్పుడు క‌రోనా పేషెంట్ల‌ను పంపి వైర‌స్ వ్యాప్తికి కుట్ర‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం ఉంద‌న్నారు. ఇది ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని చెప్పారు దిల్బాగ్ సింగ్. జ‌మ్ము కశ్మీర్ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా పోలీసులు, బ‌ల‌గాల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

More News:

ఫ్యాక్ట్ చెక్: మే 3 త‌ర్వాత లాక్ డౌన్ పొడిగింపు.. మోడీకి టాస్క్ ఫోర్స్ స‌ల‌హా?

కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం

Latest Updates