పూంఛ్ లో మళ్లీ పాకిస్థాన్ కవ్వింపు కాల్పులు

జమ్ముకశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ బలగాల కవ్వింపు కాల్పులు ఆగడం లేదు. పూంఛ్ జిల్లా షాపూర్, కిర్ణి, ఖస్బా సెక్టార్లలో పాకిస్థాన్ సైనికులు భారత్ వైపు కాల్పులు జరిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పట్టించుకోకుండా.. పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. భారత సైన్యం శత్రుమూకలపై ఎదురుదాడి చేస్తోంది. పూంఛ్ జిల్లాలోని పలు సెక్టార్లలో ఈ మధ్యాహ్నం 3.50 నుంచి ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.

Latest Updates