ఈ వెడ్డింగ్ హాల్లో పెళ్లి ఫ్రీగా చేస్తారు..కానీ ఓ షరతు

పాకిస్తాన్ లో ఓ వెడ్డింగ్ హాల్ ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాక్ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ మరోసారి హాట్ టాపిగ్గా మారారు. ఆ దేశంలో జరిగిన ఎలాంటి ఇన్సిడెంట్ నైనా ట్వీట్ చేయడం అలవాటు. ఉల్లిపాయల ధరలు, సముద్రంలో జర్నలిస్ట్ రిపోర్టింగ్, యాపిల్ ధరలు, ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేస్తుంటారు.

తాజాగా ఇనాయత్ ఓ వీడియో ను ట్వీట్ చేశారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే ఒక ఆఫర్, రెండో సారి పెళ్లి చేసుకుంటే ఇంకో ఆఫర్, మూడోసారి పెళ్లిచేసుకుంటే, నాలుగోసారి తమ వెడ్డి హాల్ లో పెళ్లిచేసుకుంటే ఫ్రీ అని సదరు వెడ్డింగ్ హాల్ ఓనర్ ఆఫర్ ప్రకటించాడు. ఆ ఆఫర్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఆ వీడియోనే పాక్ జర్నలిస్ట్ ట్వీట్ చేసింది.

బహావల్పూర్ కు చెందిన ఓ వెడ్డింగ్ హాల్ ఓనర్ తమ వెడ్డింగ్ హాల్ లో పెళ్లి చేసుకునే దంపతులకు ఆఫర్ ప్రకటించాడు. ఆ ఆఫరే సోషల్ మీడియాలో చర్చాంశనీయమైంది. ఎందుకంటారా..?

తన వెడ్డింగ్ హాల్లో రెండోసారి పెళ్లి చేసుకుంటే 50శాతం డిస్కౌంట్, మూడోసారి పెళ్లి చేసుకుంటే 75శాతం డిస్కౌంట్, నాలుగో సారి పెళ్లి చేసుకునే దంపతులకు ఫ్రీగా తామే పెళ్లి చేస్తామని ప్రకటించారు.

కానీ ఓ షరతు విధించాడు. ఎవరైనా రెండో సారి పెళ్లి చేసుకునే భర్తకి  తన మొదటి భార్యే ఈ హాల్ ను బుక్ చేయాలి. అలా ఎవరైతే బుక్ చేస్తారో వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని వెడ్డింగ్ హాల్ ఓనర్ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ హాల్ డిస్కౌంట్ నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది.

Latest Updates