దేశ రాజధానిలో ‘పాక్ జిందాబాద్’ స్లోగన్స్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొందరు వ్యక్తులు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం సంచలనం రేపింది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌‌కు సమీపంలో ఇద్దరు మగవాళ్లు, ముగ్గురు ఆడవాళ్లు ఈ నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఖాన్ మార్కెట్‌‌కు చేరుకున్నారు. స్లోగన్స్ చేసిన వారితోపాటు ఘటనతో వారి కుటుంబీకులకు ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇండియా గేట్ వద్దకు సైట్ సీయింగ్ కోసం వచ్చామని పోలీసులకు వారు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. బైకులపై రేసింగ్ మొదలుపెట్టామని, ఒక్కొక్కరిని పలు దేశాల పేర్లతో పిలుచుకుంటూ డ్రైవింగ్ చేశామని.. అందులో పాకిస్థాన్ పేరు కూడా ఉందని చెప్పినట్లు సమాచారం. ఆ రేసు సందర్భంగా ఓ పాకిస్థానీ వ్యక్తిని గుర్తించామని, అతడు పాకిస్థాన్ జిందాబాద్ అని స్లోగన్స్ చేశాడని పోలీసుల విచారణలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వీరిని పలు కోణాలలో క్వశ్చనింగ్ చేస్తున్నారు.

Latest Updates