అభినందన్ ను పట్టుకున్న పాక్ కమాండో హతం

ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధన్ ను చిత్రహింసలు పెట్టిన పాక్ కమాండో అహ్మద్  ఖాన్ ను ఇండియన్ ఆర్మీ చంపేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్  యుద్ధ విమానాలను తరుముతూ  సరిహాద్దు రేఖ దాటి పాక్ భూబాగంలో చిక్కుకుపోయిన అభినందన్ ను పాక్ సైన్యం పట్టుకొని తీవ్రంగా గాయపరిచింది. ఆ సమయంలో అహ్మద్ ఖాన్ పాక్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కమాండోగా విదులు నిర్వర్తిస్తున్నాడు .

ఈ నెల 17న నక్యాల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబాటుదార్లను పంపే ప్రయత్నం చేస్తున్న అహ్మద్ ఖాన్ ను భారత సైన్యం కాల్పులు జరిపి హతమార్చింది. అయితే అభినందన్‌ను పట్టుకున్న సమయంలో పాక్ కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫోటోలో అభినందన్ తో పాటు అహ్మద్ ఖాన్ కూడా ఉన్నాడు. పాక్ లో ట్రైనింగ్ తీసుకున్న ఉగ్రవాదులను అహ్మద్ ఖాన్  భారత్ లోకి పంపించేవాడని సమాచారం.

Latest Updates