రాజస్థాన్ లో పాక్ యువకుడు హల్ చల్

రాజస్థాన్ లోని పాక్ సరిహద్దులో ఓ పాకిస్థాన్ యువకుడు హల్ చల్ చేశాడు. పాక్ జాతీయుడిని పట్టుకున్న స్థానికులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం బర్మర్ ఏరియాలో సరిహద్దు దాటి వచ్చి.. అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు తెలిపారు స్థానికులు. తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. అతడి పేరు పార్శన్ అని చెప్పాడన్నారు బర్మర్ అడిషనల్ ఎస్పీ ఖివ్ సింగ్ భాటీ. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రశ్నిస్తున్నామని తెలిపారు పోలీసులు.

Latest Updates