మోడీని విమర్శిస్తుండగా పాక్ మంత్రికి కరెంట్ షాక్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురించి మాట్లాడుతుండగా.. పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కు కరెంట్ షాక్ తగిలింది. ఇస్లామాబాద్ లో కశ్మీర్ అవర్ పేరుతో నిర్వహించిన ఓ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని నిందిస్తూ… భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతుండగా.. ఆయనకు ఎలక్ట్రిక్ షాక్ తగిలింది.  కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్.. ఈ సభతో కశ్మీరీ ప్రజలకు మద్దతు పలికింది.

“ఇండియా దూకుడైన నిర్ణయం తీసుకుంది. మా జాగ్రత్తలో మేం ఉన్నాం. కశ్మీరీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. నరేంద్రమోడీ నీ ఆలోచనలేంటో మాకు తెలుసు…  ” అని అంటుండగానే.. షేక్ రషీద్ అహ్మద్ కు కరెంట్ షాక్ తగిలింది. ఆయన స్పీచ్ ఆపేశారు. వెంటనే తేరుకుని.. నాకు కరెంట్ షాక్ తగిలిందని అర్థమైంది. ఐనా పట్టించుకోను. ఈ సభను మోడీ ఆపలేడు అని అన్నారు పాక్ రైల్వే మంత్రి.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest Updates