కారు కొని డబ్బులెగ్గొట్టిన పాక్ మంత్రి

మంత్రిని కదా…ఏం చేసినా ఎవరూ ఏమడగరు అనుకున్నారు పాకిస్తాన్ కు చెందిన  రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్. అయితే ఆయనకు పార్లమెంట్ సాక్షిగా చేదు అనుభవం ఎదురైంది. జపాన్ లో ఉంటున్న ఓ వ్యక్తి నుంచి మంత్రి రషీద్ 22 లక్షలకు కారు కొన్నారట. అయితే కొన్న కారుకు డబ్బులు మాత్రం చెల్లించలేదు. అమ్మిన వ్యక్తి చాలా సార్లు డబ్బులు అడిగినా మంత్రి నుంచి సరైన సమాధానం రాలేదు. ఆ వ్యక్తి ఏకంగా పాక్ పార్లమెంట్ కు వచ్చారు. అంతేకాదు వెంటనే డబ్బులు ఇవ్వాలంటూ అందరి ముందు మంత్రి రషీద్ ను నిలదీశారట. దీంతో మంత్రి రషీత్ పరువు కాస్తా పోయినంతపనైంది.

Latest Updates