కశ్మీర్ ను విడగొట్టాలన్న పాక్ కల నెరవేరదు: అమిత్ షా

కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. జాతీయ భద్రత విషయంలో తాము రాజీ పడబోమన్నారు. జార్ఖండ్ లో ఇవాళ(శనివారం) జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో పాక్ ఉగ్రసంస్థలు భారత్ ను లక్ష్యంగా చేసుకునేవని తెలిపారు. భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయాలన్న పాక్ కల ఎన్నటికీ నెరవేరదన్నారు. ‘పాకిస్థాన్ నుంచి ఓ తూటా భారత్ వైపు వస్తే.. భారత్ నుంచి ఓ ఫిరంగి గుండు పాక్ కు వెళ్తుందని హెచ్చరించారు అమిత్ షా.

Latest Updates