నవాజ్‌‌ షరీఫ్‌‌ పరిస్థితి సీరియస్‌‌

  • హాస్పిటల్‌‌కు తరలింపు
  • ప్లేట్‌‌లెట్స్‌‌ కౌంట్‌‌ పడిపోయిందన్న డాక్టర్లు

లాహోర్‌‌‌‌: పాకిస్తాన్‌‌ మాజీ ప్రధాని నవాజ్‌‌ షరీఫ్‌‌ పరిస్థితి సీరియస్‌‌గా ఉంది. లాహోర్‌‌‌‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌‌ షరీఫ్‌‌ ఆరోగ్యం పూర్తిగా పాడైపోవడంతో హాస్పిటల్‌‌కు తరలించామని అధికారులు చెప్పారు. ప్లేట్‌‌లెట్స్‌‌ కౌంట్‌‌ బాగా పడిపోయిందని, పరిస్థితి సీరియస్‌‌గా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి ట్రీట్‌‌మెంట్‌‌ ఇస్తున్నామని షరీఫ్‌‌ పర్సనల్‌‌ డాక్టర్‌‌‌‌ ఆద్నాన్‌‌ ఖాన్‌‌ చెప్పారు. పాకిస్తాన్‌‌కు మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన షరీఫ్‌‌ పలు అవినీతి కేసుల్లో నిందితుడిగా తేలడంతో కోర్టు ఆయనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. కొద్ది రోజులుగా షరీఫ్‌‌ ఆరోగ్యం బాగోలేకున్నా.. అధికారులు నిర్లక్ష్యంతో హాస్పిటల్‌‌లో చేర్పించలేదని ఆయన సోదరుడు ఆరోపించారు. షరీఫ్‌‌కు ఏమైనా జరిగితే ప్రధాని ఇమ్రాన్‌‌ బాధ్యత వహించాలని ఆయన వార్నింగ్‌‌ ఇచ్చారు.

Pakistan's former prime minister Nawaz Sharif's condition deteriorated

Latest Updates