కులభూషణ్‌ అప్పీలుకు పాక్‌ పార్లమెంటు ఆమోదం

V6 Velugu Posted on Jun 11, 2021

గూఢచర్యం, తీవ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్‌ ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు ఊరట లభించింది. ఉరిశిక్షపై జాదవ్‌ అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పాక్  పార్లమెంటు ఆమోదం తెలిపింది. 2017 ఏప్రిల్‌ లో కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్తాన్‌ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించింది. దీనిపై భారత ప్రభుత్వం అప్పీలు చేయడంతో విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం అప్పీలుకు అనుమతించాలని 2019, జులైలో పాకిస్తాన్‌కు ఆదేశాలు ఇచ్చింది. భారత దౌత్యవేత్తల్ని కలిసేందుకు కూడా అనుమతించాలని ఆదేశించింది. ఈ క్రమంలో రివ్యూ అండ్‌ రీకన్సిడరేషన్‌ (ICJ) బిల్లు 2020పై చర్చించిన పాక్‌ ఇంటర్నేషనల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 

బిల్లు ఆమోదం ద్వారా పాకిస్తాన్‌ను బాధ్యతాయుత దేశంగా ప్రపంచానికి మరోసారి నిరూపించామన్నారు ఆ దేశ న్యాయశాఖ మంత్రి నసీం.

Tagged Kulbhushan Jadhav, Pakistan National Assembly, passes bill, appeal

Latest Videos

Subscribe Now

More News