దేశ చరిత్రలోనే… టీఆర్ఎస్ అఖండ విజయం

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిందని అన్నారు టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ భవన్ లో బుధవారం మాట్లాడిన ఆయన… మున్సిపాల్ ఎన్నికలలో టీఆర్ఎస్ అఖండవిజయాన్ని చూసి ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బుద్దిలేదన్నారు.. ఇప్పటికీ ఆంద్ర పాలకుల ఆలోచనలు అమలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏపీకి చెందిన కేవీపీని పెట్టుకోవాలని చేతకాని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉండటం తగదని అన్నారు. నెరేడుచర్లలో టీఆర్ఎస్ చట్టప్రకారం గెలిచిందని చెప్పారు. బీజేపీ టీఆర్ఎస్ ను విమర్శించే ముందు మణికొండ-మక్తల్ లో ఎలా గెలిచారో చూసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు…
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
సీఏఏ నిరసనల్లో పాక్ ఏజెంట్లు
ప్రపంచం అంతానికి ఇంకా 100 సెకన్లే!
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?
మోడల్ స్కూల్​ అడ్మిషన్ల​ షెడ్యూల్ విడుదల

Latest Updates