కుండ కంటే బొంగులో కల్లు బాగుందట..!

Palm wine Pot Replaced With Bamboo bone

ములుగు, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి సిద్ధంగా దొరికే తాటి కల్లు అంటే చాలా మందికి ఇష్టం. కల్లు గీత పనులు గౌడ కులస్థులు మాత్రమే చేస్తుంటారు. అయితే, బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి వచ్చిన ముప్పై కుటుంబాలు ప్రాజెక్టునగర్ సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. వీళ్లల్లో దాదాపు పది మంది గొత్తికోయలు వెదురుబొంగులో కల్లు గీస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తాటికల్లు గీస్తుంటారు. ఇలా రోజుకు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు సంపాదిస్తున్నారు. ఈ కల్లు రుచే వేరు.. తాటి బుర్ర గొలకు గొత్తికోయలు వెదురు బొంగు అమర్చి కల్లుగీస్తా రు. దీంతో ఈ కల్లుకు కొత్త రుచి వస్తుందట. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరున్న తాడ్వాయి మండలంలోని మేడారం వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం వందలాది మంది వస్తుంటరు. అయితే, ములుగు మీదుగా వచ్చే ప్రతి ఒక్కరు పస్రా నుంచి ప్రాజెక్టునగర్ దాటి మేడారం వెళ్తుంటారు. గొత్తికోయలు కల్లు గీసే పద్ధతి కొత్తగా ఉండటంతో చాలామంది ఇక్కడ ఆగుతుంటారు. ‘కుండ కంటే వెదురు బొంగులో గీసిన కల్లు మంచిగ ఉంద’ని వాళ్లు చెబుతున్నారు.

Latest Updates