పాన్‑ఆధార్ లింక్: చివరి తేదీ మార్చి 31

ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు పాన్ కార్డుతో ఆధార్‌‌ అనుసంధానం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ లింక్‌‌కు తుది గడువు(మార్చి 31) కూడా దగ్గరపడుతోంది. ఒకవేళ తుది గడువు లోపల పాన్–ఆధార్ అనుసంధానం కాకపోతే, ఆ పాన్ కార్డు ఇన్‌ వాలిడ్ అయిపోతుంది. అంతేకాక పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే ఇన్‌ కమ్ ట్యాక్స్ రిటర్నులు కూడా ప్రాసెస్ కావు. ఇన్‌ కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్‌ కార్డు హోల్డర్లందరూ ఆధార్‌‌‌‌తో లింక్ కావాల్సి ఉంది. అయితే కొంతమంది ఇప్పటికే పాన్–ఆధార్ లింక్ చేసుకుని ఉంటారు. కానీ వారిలో ఎక్కడో ఒక దగ్గర భయముంటుంది.

పాన్–ఆధార్ లింక్ ఉందా, లేదా? దాని స్టేటస్ ఏమిటి అని. అయితే పాన్–ఆధార్ లింక్ ఉందో లేదో? తెలుసుకోవడం కోసం కూడా ఒక ప్రక్రియ ఉందట. అదెలా అంటే…. మొదట www.incometaxindiaefiling.gov. in ను సందర్శించాలి. హోమ్ పేజీలో క్విక్ లింక్స్ కిందనున్న లింక్ ఆధార్‌‌‌‌ను క్లిక్ చేయాలి. మీ కంప్యూటర్ స్క్రీన్‌ పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్‌ పై ఒక కొత్త హైపర్‌‌‌‌లింక్ కనపడుతూ ఉంటుంది. ఆ హైపర్‌‌‌‌లింక్‌‌లో మీరు పాన్–ఆధార్ లింక్ సమర్పించి ఉంటే, స్టేటస్ ఏమిటో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని కనిపిస్తూ ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత, పాన్, ఆధార్ నెంబర్ వివరాలను అడుగుతుంది. వివరాలు నమోదు చేశాక, ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్’ను క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ పాన్‌ తో ఆధార్ లింక్ అయి ఉందో లేదో చూపిస్తోంది. స్టేటస్‌ ఏమిటో కూడా తెలుస్తుందని ఐటీశాఖ అధికారులు తెలిపారు.

Latest Updates