ఆధార్‌‌తో పాన్‌‌కార్డు ఈజీ

న్యూఢిల్లీ: మరింత సులువుగా పాన్‌‌కార్డుల(పర్మినెంట్‌‌ అకౌంట్‌‌ నెంబర్‌‌)ను ఇవ్వడానికి ఐటీశాఖ త్వరలో వీటిని ఆన్‌‌లైన్‌‌లో జారీ చేయనుంది. దరఖాస్తుదారుడి ఆధార్‌‌ నంబర్​ సాయంతో వెంటనే దీనిని ఇస్తారు. దీనివల్ల పాన్‌‌కార్డు కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఐటీశాఖ కొన్ని వారాల్లో ఉచితంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించనుంది.

పాన్‌‌కార్డును పోగొట్టుకున్న వారికి, కొత్త దానికోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నాయి. ఆన్‌‌లైన్‌‌లో ఆధార్‌‌ ద్వారా పాన్‌‌కార్డుకు దరఖాస్తు చేయగానే, మొబైల్‌‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఐటీశాఖ వెబ్‌‌సైట్‌‌లో ఎంటర్‌‌ చేస్తే పని పూర్తవుతుంది.

Latest Updates