నేడు పంచాయతీ కార్మికుల ప్రగతి భవన్​ ముట్టడి

గ్రామ పంచాయతి కార్మికులకు రూ.8,500 వేతనం ఇస్తామన్న హామీని అమలుచేయాలంటూ పంచాయతీ ఉద్యోగులు సోమవారం ఆందోళన చేశారు. ఏడాది గడిచినా ప్రభుత్వం వేతనాలు పెంచలేదని, ఇప్పటికీ జీవో విడుదల చేయలేదని మండిపడ్డారు. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన పంచాయతీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారని ఎంప్లాయిస్, వర్కర్స్​ యూనియన్ ​గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్​ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం తమకు వేతనాలివ్వడంలేదని ఆరోపించారు.