ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఆరువారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు యధావిధిగా సాగుతాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ అలాగే కొనసాగుతుందని, ఆ ప్రక్రయ రద్దు కాదని ఆయన తెలిపారు. కొన్నిచోట్ల అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారని.. వారి ఎన్నిక అలాగే ఉంటుందని ఏపీ ఈసీ తెలిపారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల అభీష్టాన్ని కూడా లెక్కలోకి తీసుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కాగా.. ఎన్నికలు వాయిదా పడ్డా, ఎన్నికల నియమావళి మాత్రం అలాగే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి చక్కబడిన తర్వాత ఎన్నికల రీషెడ్యూల్ తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

For More News..

హీరో నితిన్ పెళ్లి వాయిదా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా టెస్ట్

బ్యాడ్‌న్యూస్: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా

ఫోన్ కొనాలంటే వెంటనే కొనేయండి.. ఏప్రిల్ నుంచి ఫోన్ల ధర పెంపు

Latest Updates