పసిపాపను హాస్పిటల్ లోనే వదిలేశారు

వెలుగు: అభంశుభం తెలియని ఆడ శిశువును హాస్పిటల్ లోనే వదిలేశారు. మరిపెడ మండలం డక్నా తండాకు చెందిన బుజ్జి ప్రసూతి కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో చేరింది . వారం క్రితం రెండో కాన్పులో పాపకు జన్మినిచ్చింది . ఈ నెల23న ఫిట్స్​వచ్చి హాస్పిటల్ లోని బాత్రూంలో పడిపోయింది . వైద్యం అందించేలోపే మృతిచెందింది. భర్త, బంధువుల వచ్చి హాస్పిటల్ వద్ద ఆందోళన చేసి బుజ్జి మృతదేహన్ని తీసుకెళ్లారు. అయితే ఆడశిశువును మాత్రం హాస్పిటల్ లోనే వదిలేసి వెళ్లారు.

సమాచారం ఇచ్చినా ఎవరూ రాకపోవడంతో ఐసీడీఎస్ అధికారులను అప్పగించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ విషయంపై సూపరింటెండెంట్ భీంసా గర్ను ప్రశ్నించగా పాపను తీసుకెళ్లాలని పలుసార్లు ఫోన్​ చేసినా ఎవరూ స్పందించడం లేదన్నారు. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చిరెండు రోజుల్లో పాపను వరంగల్ హోంకు పంపిస్తామని తెలిపారు.

Latest Updates