పెళ్లికి పెద్దలు నో.. కరీంనగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్య

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్‍ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

దుద్దెనపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ వీరాసింగ్ (25), పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నారాయణ పల్లికి చెందిన లయా మాధురి(19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో కలిసి బతకలేకపోయినా… కలిసి చావాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి దుద్దెనపల్లిలోని వీరాసింగ్ ఇంటివద్ద ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని ఆలస్యంగా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఇద్దరూ ప్రాణాలు వదిలారు.

MORE NEWS: 

కొండాపూర్ లో పాస్టర్ హత్య

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు లేకుండా చదువంతా ఫ్రీ..

ఢిల్లీ పిల్లలు రోజూ 10 సిగరెట్లు కాల్చినట్టే!

Latest Updates