ఇంటర్నేషనల్​ స్కూల్స్..​ మనోళ్లకు ఎంతిష్టమో!

మన దేశంలో మిడిల్​ క్లాస్​ జనమే ఎక్కువ. ఆర్థికంగా మధ్య తరగతి కావొచ్చు కానీ, చదువు విషయంలో మాత్రం పై స్థాయిలోనే ఆలోచిస్తారు. తాహతుకు మించి లక్షలు ఖర్చు పెట్టి పిల్లలకి మరింత మంచి స్టడీ అందించాలని కోరుకుంటారు. దీంతో ఇక్కడ ఇంటర్నేషనల్​ స్కూల్స్​ సంఖ్య ఏటా పెరుగుతోంది. ఏడేళ్లలో డబుల్​ అయ్యాయి. ఈ విషయంలో మనం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం.

పోటీ ప్రపంచంలో బతకాలంటే తెలివితేటలుంటే చాలదు. కాంపిటీషన్​కి తగ్గ చదువు ఉండాల్సిందే. దీనికోసం  మధ్యతరగతివాళ్లు సైతం తమ పిల్లల్ని ఇంటర్నేషనల్​ స్కూల్స్​లో చదివించి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటారు.  లక్షల్లో ఉండే ఫీజులు కట్టడం తమ స్తోమతకు కొంచెం కష్టమే అయినా వెనకడుగు వేయట్లేదు. ఇతరత్రా ఖర్చుల్ని తగ్గించుకోవటానికే ఇష్టపడుతున్నారు తప్ప మరో ఆలోచన చేయట్లేదు.  దీంతో మన దేశంలో ఇంటర్నేషనల్​ స్కూల్స్​ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. వాటిలో చేరే స్టూడెంట్స్​ సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. గడచిన ఏడేళ్లలో ఇక్కడి ఇంటర్నేషనల్​ స్కూల్స్​ రెట్టింపయ్యాయి. 2012లో 313 స్కూల్స్​ ఉండగా ఇప్పుడు 708కి చేరాయి. అప్పట్లో స్టూడెంట్స్​ ఎన్​రోల్​మెంట్ 1.52 లక్షలు కాగా, ప్రస్తుతం 3.73 లక్షలకు పెరిగింది. ఇంటర్నేషనల్​ స్కూల్స్​ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా రెండో స్థానానికి చేరింది. ఫస్ట్​ ప్లేస్​లో చైనా ఉంది. పాపులేషన్​ విషయంలోనూ ఈ రెండు దేశాలవి ఇవే ర్యాంకులు.

పిల్లల్ని సర్కార్​ స్కూల్​కి పంపించటానికి మనసొప్పని పేరెంట్స్​ మొదట ప్రైవేట్​ స్కూల్స్​ వైపు చూస్తుంటారు. అక్కడ స్టడీ బాగాలేకపోతే అంతకన్నా బెటర్​ స్కూల్​​ ఉంటే బాగుండు అనుకుంటారు. చదువు పట్ల తల్లిదండ్రుల ఆలోచనల్లో వస్తున్న ఈ మార్పులను ఇంటర్నేషనల్​ స్కూల్స్​ సరిగ్గా అర్థం చేసుకుంటున్నాయి. ఇండియాలోని మిడిల్​ క్లాస్​ పేరెంట్స్​ అంచనాలకి తగ్గట్లు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న క్లాస్​ రూమ్​లను ఏర్పాటు చేస్తున్నాయి. బట్టీ చదువులకు బారెడు దూరంలో ఉంటున్నాయి. వాటికి బదులుగా అప్లికేషన్​ ఓరియెంటెడ్​ సిలబస్​​ అందిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్టూడెంట్స్​ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాయి. ఇది పేరెంట్స్​ గుర్తిస్తున్నారు. ఇంటర్నేషనల్​ స్కూల్స్​లో చేర్పించడానికి క్యూ కడుతున్నారు.

ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్

ఇంటర్నేషనల్​ స్కూల్స్​లో పిల్లల్ని ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్​ దిశగా మోటివేట్​ చేస్తున్నారు. మినీ లీడర్లుగా, ఎంటర్​ప్రెన్యూర్లుగా, టీమ్​ మెంబర్లుగా, రిస్క్​–టేకర్లుగా తయారు చేస్తున్నారు. ఇండియాలోని ఇంటర్నేషనల్​ స్కూళ్లలో 56.6 శాతం వరకు కేంబ్రిడ్జ్​ సెకండరీ సిలబసే చెబుతున్నారు. లోకల్​ స్కూళ్లకు ఇంటర్నేషనల్​ స్కూళ్లకు​ మధ్య తేడాని పేరెంట్స్​కి వివరిస్తున్నారు.

పాకిస్థాన్​ని వెనక్కి నెట్టి..

అంతర్జాతీయ స్థాయిలో ఈమధ్య చాలా అంశాల్లో పాకిస్థాన్​పై ఇండియాదే పైచేయి అవుతోంది. అదే హవాను కొనసాగిస్తూ ఇంటర్నేషనల్​ స్కూల్స్​ సంఖ్యలో పాక్​ని వెనక్కి నెట్టేసింది. యూఏఈ, పాకిస్థాన్, చైనా కన్నా వెనకున్న ఇండియా రెండు ర్యాంకులను మెరుగుపరచుకుంది.

కట్టగలిగే స్థాయిలోనే ఫీజులు

పేరెంట్స్​ ఎవరైనా తమ పిల్లల్ని ‘ది బెస్ట్​’ అనదగ్గ స్కూళ్ల​లోనే జాయిన్​ చేయించాలని చూస్తారు. కానీ ఫీజులు అందరూ కట్టగలిగే స్థాయిలో ఉండవు. కొంచెం ఎక్కువే ఉంటాయి. దీంతో వాళ్ల ‘ఇంటర్నేషనల్’​ కలలు తీరేవి కావు. ఈ కీలక అంశాన్ని గుర్తించిన స్కూల్స్​ మేనేజ్​మెంట్లు ట్యూషన్​ ఫీజులను తగ్గించటం మొదలుపెట్టాయి. ఫలితంగా స్టూడెంట్స్​ సంఖ్య పెరిగింది. ఆసియా దేశాలన్నింటిలోని ఇంటర్నేషనల్​ స్కూళ్ల​తో పోల్చినా ఇండియాలోనే ఫీజులు తక్కువ కావటం గమనించాల్సిన విషయం. ట్యూషన్​ ఫీజు రూ.7 లక్షల లోపు ఉన్న స్కూళ్ల​లో ఎన్​రోల్​మెంట్ మన దేశంలోని ఇంటర్నేషనల్​ స్కూళ్ల​లోని​ స్టూడెంట్స్​లో 18.8 శాతమే. అంతకన్నా ఎక్కువ ఫీజు ఉన్న స్కూల్స్​లోని స్టూడెంట్స్​ స్ట్రెంత్​ని మనతో పోల్చితే 6 శాతమే.

మన దేశంలో యావరేజ్​ యానువల్​ ఫీజు రూ.2 లక్షల 50 వేలు

    చైనాలో రూ.11 లక్షల 28 వేలు. యూఏఈలో రూ.5 లక్షల 79 వేలు.

    మలేషియాలో రూ.4 లక్షల 59 వేలు.

    గ్లోబల్​ యావరేజ్​ ఫీజు (రూ.6.63 లక్షలు)

    ఇండియాతో పోల్చితే 3 రెట్లు ఎక్కువ.

Latest Updates