పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అడ్డుకున్న రైతులు

పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అడ్డుకున్న రైతులు

వికారాబాద్ జిల్లా  పరిగి MLA మహేష్ రెడ్డిని అడ్డుకున్నారు రైతులు. పొలాలకు వెళ్లే రోడ్డు పనులు చేయటం లేదంటూ ఆందోళన చేపట్టారు. రాపోలు గ్రామంలో రైతువేదిక ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అడ్డుకుని.. రోడ్డు పనులపై నిలదీశారు. ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులతో అమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వీడియో తీస్తున్న వారిపై ఫైరయ్యారు మహేష్ రెడ్డి. విలేకరులు టైంపాస్ కోసం వీడియోలు తీసి.. సీన్మా చూపిస్తారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు రైతులను అడ్డుకోవటంతో గందరగోళం జరిగింది. సమస్యలు చెబుతుంటే అడ్డుకుంటారా అని నిలదీశారు రైతులు.