జగన్ ఏది చెబితే అది చేస్తా: ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్

ఏపీ సీఎం జగన్ ఏది చెబితే అది చేస్తానని అన్నారు ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ.

ఇటీవల ముఖేష్ అంబానీ జగన్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో అంబానీ తన స్నేహితుడు నత్వానీని రాజ్యసభకు నామినేట్ చేయాలని జగన్ ను కోరారు. అంబానీ విజ్ఞప్తి మేరకు పరిమల్‌ను ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో నత్వానీ విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..జగన్ వల్లే తాను మూడో సారి రాజ్యసభకు నామినేట్ అయినట్లు తెలిపారు. సీఎం ఏది చెబితే అది చేస్తానన్న నత్వానీ.. జగన్ సారధ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చేలా కృషి చేస్తామన్నారు. తన అనుభవంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామన్న ఆయన..పార్టీ ఎంపీలతో కలిసి టీమ్‌ వర్క్‌ చేస్తూ రాష్ట్రం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని  ఎంపీ నత్వానీ వెల్లడించారు

Latest Updates