వాలెంటైన్స్‌ డే : బోసిపోయిన పార్కులు

ప్రేమికుల దినోత్సవం రోజు ముఖ్యంగా పార్కులు ప్రేమికులతో కిటకిటలాడుతాయి. అయితే ఈ సారి మాత్రం అంత సందడి కన్పించడం లేదు. ప్రతీ ఏటా ప్రేమజంటలతో కిక్కిరిసి పోయే పార్కులు బోసిపోయి కన్పిస్తున్నాయి. RSS, బజరంగ్‌దళ్‌ సంస్థల హెచ్చరికలతో పార్కులు వెలవెలబోయి కన్పిస్తున్నాయి. ప్రేమికులు పార్కుల్లో కనిపిస్తే పెళ్లి చేస్తామని, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తామని బజరంగ్‌దళ్‌ ప్రకటించింది. ఈ హెచ్చరికలు ప్రేమికుల దినోత్సవంపై పూర్తిగా ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో సందడిగా ఉండే పార్కులు వాలెంటైన్స్‌ రోజున ఖాళీగా కన్పిస్తున్నాయి.

Latest Updates