విజయవాడలో పార్లే ఆగ్రో తయారీ ప్లాంట్‌‌

న్యూఢిల్లీ: ఫ్రూటీ, యాపి ఫిజ్‌‌ను తయారు చేసే పార్లే ఆగ్రో ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయవాడలో  ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. వచ్చే రెండేళ్లలో ఒక కొత్త ప్రొడక్ట్‌‌ను తీసుకొస్తామని తెలిపింది. 2022 నాటికి కంపెనీ టర్నోవర్‌‌‌‌ రూ.10 వేల కోట్లకు చేరుకుంటుందని పార్లే ఆగ్రో జాయింట్‌‌ మేనేజింగ్‌‌ డైరక్టర్‌‌‌‌ నదియా చౌహాన్‌‌ అన్నారు. గతేడాది కంపెనీ టర్నోవర్‌‌‌‌ రూ. 6,500 కోట్లుగా ఉంది. తాజాగా మాల్టో ఫ్లేవర్‌‌‌‌తో బీఫిజ్‌‌ ప్రొడక్ట్‌‌ను కంపెనీ లాంఛ్‌‌ చేసింది. ఈ ఏడాది కంపెనీ గ్రోత్‌‌ 10 శాతంగా ఉంటుందని నదియా అంచనావేశారు. ‘కొత్త ప్రొడక్ట్‌‌లను ఎక్కువగా లాంచ్ చేయాలని అనుకోవడం లేదు. నిర్ధిష్టమైన ప్రొడక్ట్‌‌లను లాంచ్‌‌ చేయడంపై దృష్టి పెట్టాం. 2022 నాటికి కేవలం ఒక్క ప్రొడక్ట్‌‌నే లాంచ్ చేసే అవకాశం ఉంది’ అని నదియా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీలను విస్తరించడంతో పాటు  గ్రీన్‌‌ ఫీల్డ్‌‌ ప్రొజెక్ట్‌‌లను  ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని అన్నారు. ప్రస్తుతం కంపెనీ గ్రోత్‌‌ చూస్తే ఏడాదికి ఒక ప్లాంట్‌‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. యాపి ఫిజ్‌‌, బీఫీజ్‌‌  కేటగిరిని కంపెనీ విస్తరించాలని చూస్తోందని, ఈ కేటగిరిలో గ్రోత్‌‌ను చూస్తున్నామని నదియా పేర్కొన్నారు. తమ తయారీ ప్లాంట్‌‌ను ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయవాడలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కానీ ఈ ప్లాంట్‌‌ కోసం ఎంత వరకు ఇన్వెస్ట్ చేస్తారో చెప్పలేదు. ఇప్పటికే ఉత్తరాఖాండ్‌‌, కర్నాటక రాష్ట్రాలలో కంపెనీ గ్రీన్‌‌ ఫీల్డ్‌‌ ప్లాంట్‌‌లను ఏర్పాటు చేసింది.  మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ ప్రకారం చూస్తే కంపెనీకి చెందిన ఇతర ప్లాంట్ల కంటే ఈ రెండు ప్లాంట్లు పెద్దవి. ప్రస్తుతం పార్లే ఆగ్రోకు దేశంలో 67 మాన్యుఫాక్చరింగ్‌‌ ప్లాంట్లున్నాయి. ఇందులో 10 ప్లాంట్లు కంపెనీకి చెందినవి కాగా, మిగిలినవి ఫ్రాంచైజిలకు చెందినవి.

బీఫిజ్ కీలకం

2022 నాటికి ఆగ్రో పార్లే టర్నోవర్‌‌‌‌ రూ. 10 వేల కోట్లకు చేరుకుంటుందని, ఇందులో బీఫిజ్‌‌ ప్రొడక్ట్‌‌ కీలకంగా ఉంటుందని నదియా అంచనావేశారు. యాపి ఫిజ్‌‌ సేల్స్‌‌కు దీటుగానే బీఫిజ్‌‌ అమ్మకాలు అవుతున్నాయని నదియా చెప్పారు. ప్రస్తుతం యాపి ఫిజ్‌‌ బ్రాండ్‌‌ వాల్యూ రూ. 1,500 కోట్లకు పైగా ఉందని అన్నారు. బీఫిజ్‌‌ మార్కెటింగ్‌‌ కోసం  ఈ ఏడాది రూ. 40 కోట్లను ఖర్చు చేయనున్నామని అన్నారు. 2019 తో పోల్చుకుంటే కంపెనీ గ్రోత్‌‌ ఈ ఏడాది 10 శాతంగా ఉంటుందని చెప్పారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో చాలా కంపెనీలు 2021 కోసం తమ ప్లాన్స్‌‌ను రెడీ చేసుకుంటాయని అన్నారు.

Latest Updates