యుద్ధం వస్తే 6 నెలలు ఆలస్యంగా ఎన్నికలు : రేవంత్ రెడ్డి

అసెంబ్లీ హాల్ లో మీడియాతో చేసిన చిట్ చాట్ లో తాజా రాజకీయాలపై మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అన్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తా అన్నారు. ఎర్రజొన్న రైతులను సీఎం కేసీఆర్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లో ఎర్ర జొన్న,పసుపు రైతుల సమస్యలు పరిష్కారం చేయకపోతే  ఉద్యమంలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి చెప్పారు.  టీఆర్ఎస్ లో కష్టపడిన వారికి పదవులు దక్కడం లేదని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందన్నారు. యుద్ధం వస్తే 6 నెలలు ఎన్నికలు లేట్ అయ్యే సూచనలు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో పొత్తులు, పోటీపై అప్పుడే చర్చ అనవసరం అన్నారు. ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టే… పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు తాను వెళ్లలేదని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 60శాతం మంది కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచ్ లు గెలిచారని అన్నారు.

Latest Updates