చివరి రోజు పార్లమెంటు ఇలా..

మోడీ ప్రభుత్వ చివరి పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. 16వ లోక్ సభ 17వ సమావేశాలు ముగియడంతో నిరవధికంగా వాయిదా పడింది. చివరి రోజు రాజ్యసభలో రచ్చ జరగగా… లోక్ సభలో… చివర్లో సభ్యులు అభినందనపూర్వకంగా మాట్లాడారు. 10రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి.

లోక్ సభ ఇవాళ అన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ నిషేధిత బిల్లు, జలియన్ వాలాబాఘ్ నేషనల్ మెమోరియల్ బిల్లులను ఆమోదించింది. రాజ్యసభ బడ్జెట్, ఫినాన్స్ బిల్లుతో పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలకు ఆమోదం తెలిపింది.

రాజ్యసభలో సభ ప్రారంభం నుంచే ప్రతిపక్షాలు ఆందోళనలతో హోరెత్తించాయి. రచ్చ మధ్య ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడి చివరకు నిరవధిక వాయిదా పడింది. వాయిదా వేసే ముందు వీడ్కోలు స్పీచ్ ఇచ్చిన చైర్మన్ వెంకయ్యనాయుడు.. ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. సభలు ప్రశాంతంగా నడిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు.

చివరగా స్పీకర్ సుమిత్రా మహాజన్ వీడ్కోలు సందేశం ఇచ్చారు. సభా నిర్వహణలో సహకరించిన డిప్యూటీ స్పీకర్ తంబిదురైకు థ్యాంక్స్ చెప్పారు. పార్టీలు చిన్నవైనా… పెద్దవైనా అందరికీ సమన్యాయం చేసేందుకు ప్రయత్నించానన్నారు.

Latest Updates