పార్లమెంట్: మాస్కు‌‌‌‌లు, ప్లాస్టిక్ షీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య సమావేశాలు

ఉదయం లోక్ సభ.. సాయంత్రం రాజ్యసభ

ఆరుగురు కూర్చునే చోట ముగ్గురే
సభ్యుల మధ్య పాలీకార్బన్ షీట్లు
కూర్చునే మాట్లాడాలన్న స్పీకర్
క్వశ్చన్ అవర్ రద్దు చేయడంపై ప్రతిపక్షాల అభ్యంతరం
అన్నింటికీ సమాధానం చెబుతామన్న అధికార పక్షం

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మాస్క్‌‌లు, ప్లాస్టిక్ షీల్డ్ లు, ఫిజికల్ డిస్టెన్స్ మధ్య సెషన్ నడిచింది. ఉదయం లోక్ సభ సమావేశం కాగా, మధ్యాహ్నం నుంచి రాజ్యసభ సెషన్ నడిచింది. కరోనా స్ప్రెడ్ కాకుండా సభలో మెంబర్ల మధ్య పాలీ కార్బన్ షీట్ల ను ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో ఇండియా, చైనా గొడవ, క్వశ్చన్ అవర్ రద్దు, నీట్‌‌కు అప్లై చేసుకున్న స్టూడెంట్ల సూసైడ్, తదితర సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. అయితే తాము ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు బిల్లులను లోక్ సభ పాస్ చేసింది.

సభ్యుల మధ్య ప్లాస్టిక్ షీల్డులు

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు లోక్ సభ సమావేశం కాగా, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు రాజ్యసభ సెషన్ నడిచింది. మంగళవారం నుంచి ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్ సభ నడవనున్నాయి. ఇక ఎంపీలు కరోనా బారిన పడకుండా గట్టి చర్యలు చేపట్టారు. బెంచ్‌‌ల ముందు గ్లాసుల్లాంటి పాలీ కార్బన్ షీట్లను ఏర్పాటు చేశారు. అలాగే మెంబర్ల పక్కన కూడా ప్లాస్టిక్ షీల్డులను పెట్టారు. దీంతో ఎవరైనా సభ్యుడు కరోనా బారిన పడినా.. మిగతా వాళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించారు. ఆరుగురు సభ్యులు కూర్చునే బెంచీల్లో ముగ్గురికే సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. సభ్యులందరూ మాస్క్ లు పెట్టుకున్నారు. కొందరు ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకున్నారు. ప్రొసీడింగ్స్ ప్రారంభం కాగానే.. సభ్యులందరూ తమ సీట్లలో కూర్చునే మాట్లాడాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. కూర్చుని మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉండొచ్చు కానీ వేరే ఆప్షన్ లేదన్నారు. మెంబర్లంతా సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ ఫాలో కావాలని కోరారు.

క్వశ్చన్ అవర్‌‌.. గోల్డెన్ అవర్‌‌

లోక్ సభ క్వశ్చన్ అవర్‌‌, ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ ను రద్దు చేస్తూ ఒక తీర్మానాన్ని  సభ ఆమోదించింది. కేవలం రాతపూర్వక ప్రశ్నలు, సమాధానాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ చర్యను కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ విమర్శించాయి. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ అవర్‌‌ చాలా అవసరమని చెప్పారు. క్వశ్చన్ అవర్‌‌ సమయంలో ఎగ్జిక్యూటివ్స్ అకౌంటబుల్ గా, ఆన్సరబుల్ గా ఉంటారన్నారు. ‘‘సామాన్య ప్రజల సమస్యలను లేవనెత్తడానికి మాకు అవకాశం లభిస్తుంది. క్వశ్చన్ అవరే అనేది గోల్డెన్ అవర్‌‌’’ అని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణచేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ‘‘కొన్ని పరిస్థితుల వల్ల క్వశ్చన్ అవర్ నిర్వహించలేమని సర్కారు చెబుతోంది. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ నిర్వహిస్తున్నప్పుడు.. క్వశ్చన్ అవర్ మాత్రమే జరపరా?’’ అని అన్నారు.

అన్నింటికీ సమాధానాలు చెబుతం

‘‘ఇది అసాధారణ సిచువేషన్. రాష్ట్రాల అసెంబ్లీలు కనీసం ఒక్క రోజు కూడా మీట్ అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి టైమ్‌‌లో మనం 850 మంది ఇక్కడ సమావేశమయ్యాం. ప్రశ్నించడానికి చాలా దారులు ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడికీ పారిపోవడంలేదు’’ అని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషీ అన్నారు. గత ఐదేళ్లలో రాజ్యసభలో 60%, లోక్ సభలో 40% క్వశ్చన్ అవర్ వేస్ట్ చేశారని జోషి చెప్పారు. సభ్యుల ప్రశ్నలన్నిటికీ జవాబిస్తామన్నారు.

మొత్తం 11 బిల్లులు

ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 11 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. సోమవారం రెండింటిని లోక్ సభ పాస్ చేసింది. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్, కామర్స్ బిల్లు, ఎసెన్షియల్ కమొడిటీస్ అమెండ్ మెంట్ మిల్లు.. తదితరాలను పాస్ చేయనుంది. ఇందులో పీఎఫ్‌‌, ఇన్సూరెన్స్, మెటర్నిటీ బెనిఫిట్స్, ఇండస్ట్రియల్ డిస్ ప్యూట్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, వెల్ఫేర్ చట్టాలకు సంబంధించిన 3 బిల్లులు ఉన్నాయి.

ప్రణబ్ ముఖర్జీకి నివాళి

9 గంటల సమయంలో సభ సమావేశమైనప్పుడు సభ్యుల సంఖ్య చాలా తక్కువగా కనిపించింది. ఈ మధ్య చనిపోయిన మాజీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ, మాజీ సీఎం అజిత్ జోగి సహా పలువురు నేతలకు సభ నివాళుర్పించింది. వాయిదా పడ్డ తర్వాత 10.20కి మళ్లీ సెషన్ ప్రారంభమైనప్పుడు సభ్యుల సంఖ్య పెరిగింది.

ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు అసంతృప్తితోనే ఉన్నప్పటికీ.. వెల్ లో ఎలాంటి ప్రొటెస్టులు చేయలేదు. వెల్ లోకి దూసుకెళ్లి నిరసనలు
తెలపొద్దంటూ ప్రభుత్వం సూచించింది.

ఎంపీల డిజిటల్ అటెండెన్స్ కోసం పార్లమెంటు ఓ మొబైల్‌‌ యాప్‌ ను రూపొందించింది. సంతకం చేసే సమయంలో పుస్తకంపై చేతులుపెట్టే
అవకాశం ఉండటంతో ఎవరూ ఎవరికీ కాంటాక్ట్ కాకుండా అప్లికేషన్ ను తయారుచేసింది కేవలం పార్లమెంటు కోర్‌ ఏరియాలో మాత్రమే
పనిచేసేలా దీన్ని రూపొందించారు.

ట్రెజరీ బెంచ్ లలో ఉన్న ముందు సీట్లలో నంబర్లు వేశారు. నంబర్ 1లో ప్రధాని మోడీ, నంబర్ 2లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్, నంబర్ 3లో అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ కూర్చున్నారు. ఇక అపొజిషన్ వైపు ముందు బెంచీల్లో డీఎంకే నేత టీఆర్ బాలు, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి ఉన్నారు.

సమాజ్ వాదీ పార్టీ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ వీల్ చైర్ లో సభకు వచ్చారు. అపొజిషన్ సైడ్‌ లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా పక్కనే కూర్చున్నారు.

రాజ్యసభలో లోక్ సభ మెంబర్లు

ప్రొసీడింగ్స్ సందర్భంగా తొలిసారిగా లోక్‌‌ సభ సభ్యులు కొందరు రాజ్యసభ చాంబర్‌‌లో కూర్చున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు పాటించేందుకు గాను రూల్స్, ప్రొసీజర్లను సడలించినట్లు స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా ఒక సభ నిర్వహణ కోసం రెండు సభల చాంబర్లను ఉపయోగిస్తున్నామని చెప్పారు. విజిటర్ల గ్యాలరీల్లో కూడా సీట్లు అలాట్ చేసినట్లు తెలిపారు. సభ్యులు ఇలా కూర్చోవడం ఇదే తొలిసారన్నారు. లోక్ సభ చాంబర్ లో 200 మంది కూర్చోగా, విజిటర్ల గ్యాలరీలో 50 మంది కూర్చున్నారు.

రాజ్యసభలో 15 మంది ప్రమాణం

న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్ని కైన 15 మంది సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వారితో ప్రమాణం చేయించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ సిబూ సోరెన్, తిరూచి శివ(డీఎంకే), ఎన్ఆర్ ఎలాంగో (డీఎంకే), అంతియూర్ పి సెల్వరసు (డీఎంకే), సయ్యద్ జాఫర్ ఇస్ల ాం (బీజేపీ), జయప్రకాశ్ నిషాద్ (బీజేపీ), పూలో దేవి నీతమ్ (కాం గ్రెస్), ఫౌజియా ఖాన్ (ఎన్సీపీ), కె.కేశవరావు (టీఆర్ఎస్), కేఆర్ సురే శ్ రెడ్డి (టీఆర్ఎస్), దినేశ్ త్రివేది (టీఎంసీ), అర్పితా ఘోష్ (టీఎంసీ), ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (ఎల్జేడీ), వనుయిరా య్ ఖార్లుఖి (ఎన్పీపీ), అజిత్ కుమా ర్ భూయాన్ (ఇండిపెం డెంట్) రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. తెలంగాణ ఎంపీలు కేశవరావు తెలుగులో ప్రమాణం చేయగా, సురేశ్ రెడ్డి ఇంగ్లిష్ లో ప్రమాణం చేశారు.

ఇండియన్ కల్చర్ పై స్టడీకి ఎక్స్ పర్ట్స్ కమిటీ – కేంద్ర మంత్రి ప్రహ్లా ద్ పటేల్ వెల్లడి
న్యూఢిల్లీ: ఇండియన్ కల్చర్ పై స్టడీ చేసేందుకు 16 మంది సభ్యులతో కమిటీ వేసినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. ఆర్కియాలాజికల్
సర్వే ఆఫ్ ఇండియా మాజీ జేడీజీ, ఇండియన్ ఆర్కియాలాజికల్ సొసైటీ చైర్మన్ కె.ఎన్.దీక్షిత్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ 12 వేల ఏళ్లు పురాతన
మైన ఇండియన్ కల్చర్‌‌పై స్టడీ చేస్తుందన్నారు. సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ను టెక్స్ట్‌ బుక్స్‌‌లో చేరుస్తారా
అనే ప్రశ్నకు.. ప్రస్తుతం ఎలాంటి ప్రపోజల్ లేదన్నారు.

మరో 25 మందికి కరోనా
ఇప్పటికే కొం దరు కేం ద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడగా.. కొత్తగా మరో 25 మంది ఎంపీలకు వైరస్ సోకింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 12న పార్లమెంట్‌‌ ఆవరణలో లోక్‌‌సభ, రాజ్యసభ సభ్యు లకు కరోనా టెస్టులు చేశారు. అందులో 17 మంది లోక్‌‌సభ ఎంపీలకు, 8 మంది రాజ్యసభ ఎంపీలకు వైరస్‌‌ సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా 12 మంది బీజేపీ సభ్యు లు కరోనా బారిన పడ్డారు. ఇందులో అనంత్‌ కు మార్‌ హెగ్డే, మీనాక్షీ లేఖి తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు మాధవి, రెడ్డప్పలకు కూడా
వైరస్ సోకిం ది. పార్లమెంట్‌‌ రిసెప్షన్‌‌ వద్ద రెం డు సభల సభ్యు లు, అధికారులు, మీడియా సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. మొత్తం 56 మందికి పాజిటివ్‌‌గా నిర్ధా రణ అయింది.

బాలీవుడ్ పై డ్రగ్ మాఫియా ఎఫెక్ట్ – లోక్ సభలో బీజేపీ ఎంపీ రవి కిషన్
న్యూఢిల్లీ: బాలీవుడ్‌‌లో డ్రగ్స్ వ్యవహా రంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ, భోజ్ పురి నటుడు రవికిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
సోమవారం లోక్ సభ జీరో అవర్ లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంలో డ్రగ్ అడిక్షన్ పెరుగుతోందన్నారు. చైనా, పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నట్లు చెప్పారు. మన యువతను నాశనం చేసేందు కు పొరుగు దేశాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. ఫిలిం ఇండస్ట్రీపైనా డ్రగ్స్ ప్రభావం పడిందన్నారు. డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేయడంలో ఎన్ సీబీ బాగా పని చేస్తోందన్నారు.

37 వేల నుంచి 38 వేల డెత్స్‌‌ తగ్గించాం- కరోనాపై లోక్ సభలో హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్
న్యూఢిల్లీ: కరోనాపై సరైన టైమ్‌ లో తీసుకున్న నిర్ణయాలు, లాక్ డౌన్ వల్ల 14 లక్షల నుం చి 29 లక్షల కేసు లు.. 37 వేల నుంచి 38 వేల మరణాలు తగ్గించినట్లు కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ చెప్పారు. కరోనా కంట్రోల్ కోసం తీసుకున్న చర్యలపై సభలో ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు. దేశంలో నమోదైన 92% కేసుల్లో మైల్డ్ సిం ప్టమ్స్ ఉన్నట్లు చెప్పారు. 1.7% కేసుల్లో ఐసీయూ అవసరమైందన్నారు. ఈ నెల 11 నాటికి 45 లక్షల 62 వేల 414 కరోనా కేసు లు, 76,271 డెత్స్ నమోదైనట్లు చెప్పారు.

Latest Updates