‘ఫేస్ బుక్’పై పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి

వెలుగు: ఇండియన్ యూజర్ల మధ్య విభేదాల్ని సృష్టించడం, హింసను ప్రేరేపించడం, రానున్న లోక్ సభ ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యానికి వారధిగా ఉండటంలో తమ పాత్రపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వివరణ ఇచ్చుకుంది. ఇండియాలో ఫేస్ బుక్ యూజర్ల హక్కులు, భద్రతకు ఎలాంటి ఢోకాలేదని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జోయెల్ కప్లాన్ తెలిపారు. బుధవారం ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ముందు విచారణకు హాజరైన ఆయన, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నదీ కమిటీకి వివరించినట్లు పేర్కొన్నారు. కాగా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ, జోయెల్ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 10 రోజుల్లోగా సమగ్రవిధానంతో మళ్లీ కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా ‘ఫేస్ బుక్ సమాజానికి సేవ చేస్తున్నదా , జనాన్ని వర్గాలుగా విడగొడుతున్నదా ?’అని కమిటీ ప్రశ్నించగా, జోయెల్ సూటిగా సమాధానం చెప్పకుండా ‘వాళ్లు హైబ్రీడ్ కంపెనీ’ అని మాత్రమే బదులిచ్చారు.

Latest Updates