కరోనా రూల్స్​తో ఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు

20 ఏళ్లలో తొలిసారిగా
ఆల్ పార్టీ మీటింగ్ రద్దు

దేశంలోకి కరోనా ఎంటరయ్యాక తొలిసారిగా పార్లమెంట్ భేటీ కాబోతోంది. సోమవారం నుంచి వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. సెషన్ ప్రారంభానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్ ను ఈసారి రద్దు చేశారు. సమావేశాలు అక్టోబర్ 1న ముగియనున్నాయి. పార్లమెంటుకు హాజరయ్యే ప్రతి సభ్యుడికీ కరోనా టెస్టు చేసి, నెగెటివ్‌ వచ్చిన వారినే లోపలికి అనుమతిస్తారు. సభ్యులతోపాటు ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బందికి కూడా టెస్టులు చేయనున్నారు.

Latest Updates