స్మగ్లింగ్ కి సహకరిస్తున్న చిలుక అరెస్ట్

చిలుక అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది జ్యోతిష్యం. చిన్న పిల్లలకైతే చిట్టి చిలకమ్మా..అమ్మ కొట్టిందా అనే పద్యం గుర్తుకు వస్తుంది. మన దగ్గర జ్యోతిష్యానికి మాత్రమే చిలుకలను వాడుకుంటూ చిల్లర సంపాందిస్తారు. అయితే బ్రెజిల్ మాత్రం చిలకలతో కోట్లు సంపాదిస్తున్నారు స్మగ్లర్లు. చిలుకలకు ట్రైనింగ్ ఇచ్చి మాటలు నేర్పిస్తారు. ఆ తర్వాత వారు ఎక్కడికి స్మగ్లింగ్ కి వెళ్లినా చిలుకను తీసుకెళ్తారు. గేటు ముందు కాపాలా పెడుతారు. ఎవరైనా వస్తున్నారంటే చాలు ఆ చిట్టి చిలుకమ్మ అరుస్తుందంటా. దీంతో చోరీ చేసుకున్న దొంగలు ఎవరికీ దొరకకుండా బయటపడుతారట. ఎట్టకేలకు ఈ చిట్టి చిలుకమ్మపోలీసులకు దొరికింది. డ్రగ్స్ ముఠా ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్ సరఫరా చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు భారీ బలగంతో స్పాట్ కు చేరుకున్నారు.

లోపల గుట్టు చప్పుడు కాకుండా పని కానిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు వచ్చిన విషయం తెలియదు. కానీ పంజరంలో ఉన్న చిలుక మాత్రం పోలీసుల రాకను పసిగట్టింది. వెంటనే తన బాస్ లను అలర్ట్ చేసింది. ‘మమ్మా.. పోలీస్’ అని అరిచింది. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు మరో మార్గం ద్వారా అక్కడినుంచి పారిపోయారు. లోపలకు వచ్చిన పోలీసులకు నిరాశే మిగిలింది. అక్కడ ఒక్కరూ లేరు. అందరూ జంప్. పంజరంలోని చిలుకే ఇంత పని చేసిందని పోలీసులు నిర్దారించుకున్నారు.  దాంతో.. పద పోలీస్ స్టేషన్‌కి అని దాన్ని పట్టుకుపోయారు. స్టేషన్‌కి వెళ్లిన తరువాత మాత్రం కిక్కురుమనకుండా కూర్చుందట చిలుక. విషయం తెలుసుకున్న పక్షి ప్రేమికులు మాత్రం చిలుకని అరెస్ట్ చేయడం ఏవిటండీ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దాన్ని వదిలి పెట్టండి అంటూ డిమాండ్ చేశారు. పోలీసులు చేసేదేం లేక చిలుకని జంతుప్రదర్శనశాలకు అప్పగించారు.

Latest Updates