సచిన్‌ కోసం పార్టీ తలుపులు మూసేయలేదు

న్యూఢిల్లీ: రాజస్థాన్ డిప్యూటీ సీఎం పదవితోపాటు ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌ పోస్ట్‌ నుంచి సచిన్ పైలట్‌ను కాంగ్రెస్ పార్టీ తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై సచిన్ స్పందిస్తూ తాను బీజేపీలో చేరట్లేదని బుధవారం ట్వీట్ చేశారు. సచిన్ తొలగింపుపై రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ అవినాశ్ పాండే చేసిన ట్వీట్ ఆసక్తికర ట్వీట్ చేశారు. సచిన్‌కు ఇంకా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు.

‘సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ తలుపులు మూసేయలేదు. సచిన్ తన తప్పులను తెలుసుకునేలా దేవుడు ఆయనకు జ్ఞానాన్ని ఇవ్వాలి. బీజేపీ మోసపూరిత మార్గాల నుంచి ఆయన బయటపడతారని నేను నమ్ముతున్నా’ అని అవినాశ్ చెప్పారు. ఇదిలా ఉండగా సచిన్‌ పైలట్‌తోపాటు 18 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాజస్థాన్ స్పీకర్ నోటీసులు పంపారు. నోటీసులపై శుక్రవారం లోపు స్పందించాలని ఆదేశించారు.

Latest Updates